Varalakshmi Vratham Pooja Vidhanam PDF Telugu

Varalakshmi Vratham Pooja Vidhanam Telugu PDF Download

Free download PDF of Varalakshmi Vratham Pooja Vidhanam Telugu using the direct link provided at the bottom of the PDF description.

DMCA / REPORT COPYRIGHT

Varalakshmi Vratham Pooja Vidhanam Telugu - Description

Dear readers, here we are offering Varalakshmi Vratham Pooja Vidhanam in Telugu PDF to all of you. Varalakshmi Vratham Pooja is a very important day in Hindu Pnahcangam. It is a highly fruitful fast dedicated to the Goddess Varalakshmi. Goddess Varalakshmi is one of the forms of Goddess Mahalakshmi.
In today’s materialistic world everyone is worrying about their pocket and wants to have a quality life for themselves and their families but it is not possible for all to have the life they dreamed of. We can do multiple remedies for getting rid of poverty and financial crisis but Varalakshmi Vratham Pooja is the most effective way to do it.
It is suggested to observe Varalakshmi Vratham Pooja with proper procedure and complete devotion in heart to overcome all kind of monetary problems and lack of finance. This Fast is also suggested for the women to get a blissful marital life and desired life partner.

Varalakshmi Vratham Pooja Vidhanam in Telugu PDF / వరలక్ష్మీ వ్రతం పూజా విధానం ఇన్ తెలుగు PDF

శుక్రవారం నాడు ఇలా చేయండి
వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, ఇంటినిశుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి.
ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గువేసి, కలశం ఏర్పాటుచేసుకోవాలి. అమ్మవారి ఫొటో అమర్చు కోవాలి. పూజాసామగ్రిని అంతా సిద్ధం చేసుకోవాలి. తోరాలు ముందుగానే సిద్ధం చేసుకునిఉంచాలి. అక్షతలు, పసుపు గణపతిని సిద్ధంగా ఉంచు కోవాలి.
పసుపు, కుంకుమ, వాయనం ఇవ్వడానికి అవసరమైన వస్తువులు, ఎర్రటి రవికె వస్త్రం, గంధము, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, తోరములు కట్టుకోవడానికి దారం, టెంకాయలు, దీపపుకుందులు, ఐదువత్తులతో, హారతి ఇవ్వడానికి, అవసరమైన పంచహారతి, దీపారాధనకునెయ్యి, కర్పూరం, అగరువత్తులు, బియ్యం, శనగలు మొదలైనవి.
తోరం ఎలా తయారుచేసుకోవాలి
తెల్లటి దారాన్ని తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపురాసుకోవాలి. ఆ దారానికి తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటే తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి, తొమ్మిదో పువ్వులతో తొమ్మిది ముడులతో తోరాలను తయారుచేసుకుని, పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆవిధంగా తోరాలనుతయారుచేసుకున్న తరువాత పూజకు సిద్ధంకావాలి. అమ్మవారికి ఇరువైపుల లేదా ఒక్కవైపున దీపారాధన చేయండి. దీపం ఉత్తరం లేదా ఆగ్నేయం లేదా మీకు అవకాశం ఉన్నవైపు పెట్టండి. దీపాన్ని వెలిగించిన తర్వాత కింది చెప్పినట్లు వ్రతం చేసుకోండి.
ఆచమనం
(మొదటి మూడు నామాలతో పంచపాత్రలోని నీటిని ఉద్ధరిణితో చేతిలో పోసుకొని తీసుకోవాలి)
ఓం కేశవాయ స్వాహా                  ఓం నారాయణాయ స్వాహా
ఓం మాధవాయ స్వాహా              గోవిందాయ నమః (చేయికడుగుకోవాలి)
విష్ణవే నమః                             మధుసూదనాయ నమః
త్రివిక్రమాయ నమః                    వామనాయ నమః
శ్రీధరాయ నమః                    హృషికేశాయ నమః
పద్మనాభాయ నమః              దామోదరాయ నమః
సంకర్షణాయ నమః                 వాసుదేవాయ నమః
ప్రద్యుమ్నాయ నమః              అనిరుద్ధాయ నమః
పురుషోత్తమాయ నమః          అధోక్షజాయ నమః
నారసింహాయ నమః              అచ్యుతాయ నమః
జనార్ధనాయ నమః               ఉపేంద్రాయ నమః
హరయే నమః                     శ్రీకృష్ణాయ నమః
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః         (అని పై నామములను స్మరింపవలెను)
శ్లో|| ఉత్తిష్ఠంతుభూతపిశాచాః ఏతే భూమిభారకాః |
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ||
పై శ్లోకము చదివి అక్షతలు వాసన చూచి తమ ఎడమవైపున వేసుకొనవలయును.
ఆ తరువాత కుడిచేతితో ముక్కు పట్టుకొని ఈ క్రింది విధముగా ప్రాణాయామము చేయవలయును.
ప్రాణాయామము :
ఓం భూః, ఓంభువ, ఓగ్ ంసువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్, ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం ||
పై మంత్రముతో 3 మార్లు ప్రాణాయామము చేసి సంకల్పం చేయాలి.

సంకల్పం :
ఓం మమ ఉపాత్తదురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శొభనే ముహూర్తే అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే అస్మిన్(ఆయా ప్రంతాలకు మార్చుకోవాలి) వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరానాం మధ్యే శ్రీశార్వరీనామ సంవత్సరే, దక్షిణాయనే, వర్ష ఋతౌ, శ్రావణమాసే, శుక్లపక్షే , ద్వాదశి తిధౌ, బృగువాసర యుక్తాయాం, శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, శుభతిదౌ, శ్రీమత్యాః …..(పేరు చెప్పాలి), గోత్రః ………(గోత్రం పేరు చెప్పాలి) నామధేయస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ, స్థైర్య, విజయ ఆయురారొగ్య ఐశ్వర్యాభివ్రుధ్యర్ధం, ధర్మార్ధ కామమోక్ష చతుర్విద ఫలపురుషార్ధ సిద్ధ్యర్ధం, ప్రారబ్ధదోష నివృత్తి ద్వారా శ్రీ వరలక్ష్మీ ప్రసాదేన అష్టైశ్వర్యయుత శ్రీమహాలక్ష్మీ ప్రాప్తర్థ్యర్థం, మనోవాంఛా పరిపూర్ణార్థం శ్రీ వరలక్ష్మీవ్రతం కరిష్యే అధౌనిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీమహా గణపతి స్మరణ పూర్వక పంచోపచార పూకాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే.
(కలశమునకు గంధపు బొట్లు పెట్టి అక్షింతలు వేసి,  లోపల ఒకపుష్పమునుంచి ఆ పాత్రపై కుడి చేతితో మూసి ఈ క్రింది మంత్రమును చేప్పుకోవాలి )
కలశస్య ముఖే విష్ణు: కంఠే రుద్ర స్సమాశ్రిత:|
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాత్రు గణా: స్మృతా:||
కుక్షౌతు సాగరా: సరేసప్త దీపా వసుంధరా|
ఋగ్వేదొ విధ యజుర్వేద: సామవేదొ హ్యధర్వణ:||
అంగైశ్చ సహితా: సర్వే కలశాంబు సమాశ్రితా:|
ఆయంతు దేవ పూజార్థం దురితక్షయ కారకా:||
కలశంలోని నీళ్ళు అమ్మవారిమీద పూజద్రవ్యాల మీద ఆకుతో లేదా పుష్పంతో చల్లండి.

గంగేచ యమునే చైవ గొదావరి సరస్వతి|
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు||
కలశొదకేన పూజా ద్రవ్యాణి దేవమండపఆత్మానంచ సంప్రొక్ష్య
(కలశములొని నీటిని పూజ ద్రవ్యములపైన మన పైన చల్లుకోవాలి)

గణపతి పూజ

అదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరిష్యే
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదా॥
ఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందన
పూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయక॥
గణపతిపై అక్షతలు చల్లాలి. యధాశక్తి షోడశోపచార పూజ చేయాలి.
ఓం సుముఖాయ నమః,                    ఓం ఏకదంతాయ నమః,
ఓం కపిలాయ నమః,                        ఓం గజకర్ణికాయ నమః,
ఓంలంబోదరాయ నమః,                    ఓం వికటాయ నమః,
ఓం విఘ్నరాజాయ నమః,                    ఓం గణాధిపాయ నమః,
ఓంధూమకేతవే నమః,                        ఓం వక్రతుండాయ నమః,
ఓం గణాధ్యక్షాయ నమః,                    ఓం ఫాలచంద్రాయ నమః,
ఓం గజాననాయ నమః,                    ఓం శూర్పకర్ణాయ నమః,
ఓం హేరంబాయ నమః,                    ఓం దపూర్వజాయనమః,
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
నానావిధ పరిమళపుత్ర పుష్పాణి సమర్పయామి అంటూస్వామిపై పుష్పాలు ఉంచాలి.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపం ఆఘ్రాపయామి
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి.
స్వామివారి ముందు పళ్ళుగానీ బెల్లాన్ని గానీ నైవేద్యంగా పెట్టాలి.
It is not the complete Varalakshmi Vratham Pooja Vidhanam, if you want the complete one, download the PDF.
You can download Varalakshmi Vratham Pooja Vidhanam in Telugu PDF by clicking on the following download button.

Download Varalakshmi Vratham Pooja Vidhanam PDF using below link

REPORT THISIf the download link of Varalakshmi Vratham Pooja Vidhanam PDF is not working or you feel any other problem with it, please Leave a Comment / Feedback. If Varalakshmi Vratham Pooja Vidhanam is a copyright material Report This by sending a mail at [email protected]. We will not be providing the file or link of a reported PDF or any source for downloading at any cost.

RELATED PDF FILES

One thought on “Varalakshmi Vratham Pooja Vidhanam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *