Sri Rama Navami Pooja Vidhanam in Telugu PDF

Sri Rama Navami Pooja Vidhanam in Telugu PDF Download

Sri Rama Navami Pooja Vidhanam in Telugu PDF download link is given at the bottom of this article. You can direct download PDF of Sri Rama Navami Pooja Vidhanam in Telugu for free using the download button.

Tags:

Sri Rama Navami Pooja Vidhanam in Telugu PDF Summary

Dear readers, here we are offering Sri Rama Navami Pooja Vidhanam in Telugu PDF to all of you. Lord Shri Ram is one of the most important and popular deities in Hindu Dharma. Lord Rama is also a highly worshipped deity all around the world. Lord Rama also known as Maryada Purosshotam means the one who always follows the prices and does whatever needs to be done to keep his promise. If you want to seek the ultimate blessings and grace of Lord Rama then you should perform Sri Rama Navami Pooja with proper Pooja Vidhanam so that your prayers can reach Lord Rama.

Lord Rama always stands in the favor of Truth & Honesty and he inspires us to achieve our goals through unconditional dedication. We hope the given Sri Rama Navami Pooja Vidhanam in Telugu pdf will prove helpful to you while doing Shri Ram Navami Puja at home. There are many people who are going through hard times nowadays but they should not lose hope and seek inspiration from the life lessons of Rama Ji. Bhagwan Shri Ram has taught us to overcome every kind of problem and hurdle in our life by optimally using the resources that we have.

Sri Rama Navami Pooja Vidhanam in Telugu PDF 2023

శ్రీ రామనవమి పూజావిధానము

ప్రాతఃకాలమున నిద్రలేచి స్నానాది నిత్యకృత్యాలను ఆచరించి, శుద్ధుడై, తులసీ పుష్ప ఫలాది పూజాద్రవ్యాలను ఏర్పరచుకొని – శ్రీరాముని పటానికి గానీ, విగ్రహనికి గానీ యధావిధి పూజించాలి.

శ్రీ కేశవాది – నామాలతో ఆచమనీయం చేసిన తరువాత, ప్రాణాయామం ఆచరించి – సంకల్పించుకోవాలి.

మమ  ఉపాత్త  దురితక్షయ  ద్వారా  శ్రీ  పరమేశ్వర ప్రీత్యర్ధం శుభేశోభనే ముహూర్తే శ్రీ మహా విష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః  ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే  కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః……. దిగ్భాగే, శ్రీశైలస్య…… ప్రథేశే,  గంగాగోదావర్యోః  మధ్యదేశే,  అస్మిన్  వర్తమాన వ్యావహారిక  చాన్ద్రమానేన స్వస్తిశ్రీ……. నామ సంవత్సరే ఉత్తరాయణే  వసంత ఋతౌ  చైత్రమాసే  శుక్లపక్షే  నవమ్యాం తిథౌ  …వాసరే శుభనక్షత్ర శుభయోగ  శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ  శ్రీమాన్… గోత్రః  ధర్మపత్నీ  సమేతః……  నామధేయః, శ్రీమతః….. గోత్రస్య….. నామ ధేయస్య  సహకుటుంబస్య క్షేమ స్త్థెర్య ధ్తెర్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్ధం, జాంబవత్సుగ్రీవ హనుమ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత  శ్రీ సీతారామచన్ద్ర దేవతా ప్రీత్యర్థం , శ్రీ సీతారామచన్ద్ర దేవతా ప్రసాద సిద్ధ్యర్థం  షోడశోపచార పూజాం కరిష్యే…..

                అని సంకల్పించుకొని కలాశారాధన  చేసి – కలశంపై చేతినుంచి

శ్లో||   కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః

          మూలే తత్రస్ఠితో బ్రహ్మ మధ్యే మాతృగణాః స్ఠితాః||

          కుక్షౌతు సాగరాస్సర్వే  సప్తద్వీపా వసుంధరా|

          ఋగ్వేదోథయజుర్వేద స్సామవేదో హ్యథర్వణః||

          అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః|

          గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి|

          నర్మదే సిన్ధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు||

  -(కలశజలాన్ని పుష్పంతోగాని, తులసితోగానీ, తీసుకొని దైవప్రతిమపై ప్రోక్షించి, తనపై జల్లుకుని, పుజద్రవ్యాలపై జల్లి-)

ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం

శ్రీ మహగణపతి పుజాం కరిష్యే-(గణపతిని పూజించాక-) పూర్వ సంకల్పిత శ్రీసీతారామచన్ద్ర పూజాం కరిష్యే — అని పూజారంభం చేయాలి.

ధ్యానం —   వామేభూమిసుతా పురస్తుహనుమాన్ పశ్చాత్సుమిత్రా సుతః|

శత్రుఘ్నోభరతశ్చ పార్శ్వదళయోఃవాయ్వాది కోణేషుచ

సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్తారాసుతో జాంబవాన్|

మధ్యే నీలసరోజ కోమలరుచిం రామం భజే శ్యామలం.

శ్లో||  కందర్పకోటి లావణ్యం – మందస్మిత శుభేక్షణం

           మహాభుజం శ్యామవర్ణం – సీతారామం భజామ్యహం

శ్రీసీతరామచంద్ర పరమాత్మనే నమః ధ్యానం సమర్పయామి

ఆవాహనం–  శ్రీరామాగచ్ఛ భగవన్ – రఘువీర నృపోత్తమ

జానక్యా సహ రాజేంద్ర — సుస్థిరో భవసర్వదా.

శ్లో||  రామచంద్ర మహేష్వాస – రావణాంతక రాఘవ

           యావత్పూజాం సమాప్యేహం – తావత్త్వం సన్నిధిం కురు.

శ్లో||  రఘునాయక రాజర్షే – నమో రాజీవలోచన

           రఘునందన మే దేవ – శ్రీరామాభిముఖో భవ

శ్రీసీతారామచంద్ర పరమాత్మనే నమః ఆవాహనం సమర్పయామి

సింహసనం

                      రాజాధిరాజ రాజేంద్ర – రామచంద్ర మహాప్రభో

                      రత్నసింహసనం తుభ్యం –  దాస్యామి స్వీకురు ప్రభో||

శ్రీసీతారామచంద్ర పరమాత్మనే నమః నవరత్నఖచిత సింహసనం సమర్పయామి

పాద్యం

                 త్త్రెలోక్య పావనానంత – నమస్తే రఘునాయక

                 పాద్యం గృహణ రాజర్షే –  నమో రాజీవలోచన

శ్రీసీతారామచంద్ర పరమాత్మనే నమః పాదయోః పాద్యం సమర్పయామి

అర్ఘ్యం

            పరిపూర్ణ పరానంద – నమో రాజీవ లోచన

            గృహణార్ఘ్యం మయాదత్తం – కృష్ణవిష్ణో జనార్దన

 శ్రీసీతారామచంద్ర పరమాత్మనే నమః హస్తయోః అర్ఘ్య్ం సమర్పయామి

ఆచమనం

             నమో నిత్యాయ శుద్ధాయ – బుద్ధాయ పరమాత్మనే

             గృహాణాచమనం రామ – సర్వలోకైక నాయక!

 శ్రీసీతారామచంద్ర పరమాత్మనే నమః ముఖే ఆచమనం సమర్పయామి

మధుపర్కం

            నమః శ్రీవాసుదేవాయ – బుద్ధాయ పరమాత్మనే

            మధుపర్కం గృహణేదం – రాజరాజాయతే నమః

శ్రీసీతారామచంద్ర పరమాత్మనే నమః మధుపర్కం సమర్పయామి

పంచామృతస్నానం

      క్షీరం దధి ఘృతం చైవ – శర్కరా మధు సంయుతం

      సిద్ధం పంచామృత స్నానం – రామ త్వం ప్రతిగృహ్యతాం

శ్రీసీతారామచంద్ర పరమాత్మనే నమః పంచామృత స్నానం సమర్పయామి

శుద్ధోదక స్నానం

        బ్రహ్మాండోదర మధ్యస్థం – తీర్థైశ్చ రఘునందన

        స్నాపయిష్యా మ్యహం భక్త్యా – సంగృహాణ జనార్ధన!

శ్రీసీతారామచంద్ర పరమాత్మనే నమః స్నానాంతరం ఆచమనీయం సమర్పయామి

వస్త్రం

   సంతప్త కాంచన ప్రఖ్యం – పీతాంబర యుగం శుభం

   సంగృహాణ జగన్నాథ  – రామచంద్ర నమోస్తు తే

శ్రీసీతారామచంద్ర పరమాత్మనే నమః వస్త్రయుగ్మం సమర్పయామి

అనంతరం ఆచమనీయం సమర్పయామి. యజ్ఞోపవీతం సమర్పయామి

ఆభరణాని

        కౌస్తుభాహార  కేయూర –  రత్న కంకణ నూపురాన్

        ఏవమాదీ నలంకారాన్ – గృహాణ జగదీశ్వర!

శ్రీసీతారామచంద్ర పరమాత్మనే నమః ఆభరణాన్ సమర్పయామి

గంధం

     కుంకుమాగరు కస్తూరీ – కర్పూరై ర్మిశ్ర సంభవమ్

     తుభ్యం దాస్యామి దేవేశ –  శ్రీ రామ స్వీకురు ప్రభో

శ్రీసీతారామచంద్ర పరమాత్మనే నమః శ్రీగంధం సమర్పయామి

పుష్పం

         తులసీకుందమందార జాతీపున్నాగచంపకైః

         నీలాంబుజైర్బిల్వదళైః పుష్పమాల్యైశ్చ రాఘవ!

పూజాయిష్యామ్యహం భక్త్యా సంగృహాణ జనార్దన

శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే నమః నానావిధ పరిమళపత్ర పుష్పాణీ సమర్పయామి

వనమాలా

                 తులసీ కుంద మందార –  పారిజాతాంబుజైర్యుతాం

                 వనమాలాం ప్రదాస్యామి –  గృహణ జగద్వీశ్వర

శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే నమః వనమాలాం సమర్పయామి

అథ అంగపూజా

శ్రీరామాయ నమః                  పాదౌ పూజయామి

శ్రీరామభద్రాయ నమః        జంఘే పూజయామి

శ్రీరామచంద్రాయ నమః  జానునీ పూజయామి

శ్రీశాశ్వతాయ నమః       ఊరూన్  పూజయామి

శ్రీ రఘువల్లభాయ నమః  కటిం పూజయామి

శ్రీ దశరథాత్మజాయ నమః  ఉదరం పూజయామి

కౌసలేయాయ నమః    నాభింపూజయామి

శ్రీ లక్ష్మణాగ్రాజాయ నమః    వక్షస్థలం పూజయామి

శ్రీ కౌస్తుభాభరణాయ నమః  కంఠం పూజయామి

శ్రీ రాజరాజాయ నమః స్కంధౌ పూజయామి

శ్రీ కోదండధరాయ నమః    బాహూన్ పూజయామి

శ్రీ భరతాగ్రజాయ నమః  ముఖం పూజయామి

శ్రీ పద్మాక్షాయ నమః   నేత్రౌ పూజయామి

శ్రీ రమాయై నమః      కర్ణౌ పూజయామి

శ్రీ సర్వేశ్వరాయ నమః   శిరః పూజయమి

శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మాణే నమః సర్వాంణ్యంగాని పూజాయామి

తతః శ్రీ రామాష్టోత్తర శతనామా పూజాం కుర్యాత్

ధూపం

             వనస్పత్యుద్భవై ర్దివ్యై –  ర్నానాగంధై స్సుసంయుతః

             అఘ్రేయ స్సర్వదేవానాం –  ధూపోయం ప్రతిగృహ్యతాం

శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే నమః ధూపమాఘ్రాపయామి

దీపం

               జ్యోతిషాం పతయే తుభ్యం – నమో రామాయా వేధసే

               గృహాణ దీపకం రాజన్ –  త్రైలోక్య తిమిరాపహం

విధి ప్రకారేణ నివేదనం కుర్యాత్, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.

అమృతాపి ధానమసి ఉత్తరాపొశనం సమర్పయామి. హస్తౌప్రక్షాళయామి ముఖే ప్రక్షాళనం సమర్పయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి.

తాంబూలం

         నాగవల్లీ దళైర్యుక్తం –  ఫూగీఫల సమన్వితం

         తాంబూలం గృహ్యతాం రామ కర్పూరాది సమన్వితం

నీరాజనం

                మంగళం విశ్వకళ్యాణ – నీరాజన మిదం హరే

                సంగృహాణ జగన్నాథ – రామభద్ర నమోస్తుతే

            శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే నమః నీరాజనం

            దర్శయామి నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి

మంత్రపుష్పం

             నమో దేవాదిదేవాయ –  రఘునాథాయ శారిఙ్గణే

             చిన్మయానంద రూపాయ –  సీతాయాః పతయే నమః

   శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే నమః

   సువర్ణ దివ్యమంత్ర పుష్పం సమర్పయామి

ప్రదక్షిణ నమస్కారం

                       యానికానిచ పాపాని – జన్మాతర కృతానిచ

                       తాని తాని ప్రణశ్యంతి – ప్రదక్షిణ పదేపదే

                       పాపోహం పాపకర్మాహం – పాపాత్మా పాపసంభవః

                       త్రాహిమాం కృపయా  దేవ – శరణాగత వత్సల!

                       అన్యధా శరణం నాస్తి  –  త్వమేవ శరణం మమ

                        తస్మాత్కారుణ్య భావేన –  రక్షరక్ష రఘూత్తమ||

శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే నమః

   ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి

పుష్పాంజలి

                 దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి

                 తన్నో రామచంద్రః  ప్రచోదయాత్

శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే నమః   పుష్పాంజలి    సమర్పయామి

ఉత్తరపూజా 

                శ్రీజాంబవత్సుగ్రీవ హనుమత్ లక్ష్మణ భరతశత్రుఘ్న పరివార సహిత

                శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః

ఛత్రం ధారయామి – చామరం వీజయామి

గీతం శ్రావయామి – నృత్యం దర్శయామి

ఆందోళికా మారోహయామి – అశ్వ మారోహయామి

గజమారోహయామి – సమస్త రాజోపచార దేవ్యోపచార భక్త్యోపచార శక్త్యోపచార పూజాం సమర్పయామి

యస్యస్మృత్యా చ నామోక్త్యా – తపఃపూజా క్రియాదిషు

న్యూనం సంపూర్ణతాం యాతి – సద్యో వన్దే  తమచ్యుతమ్!

యత్పూజితం మయా రామ! –  పరిపూర్ణం తదస్తుతే

అనయా ధ్యానావాహనాది పూజయా

శ్రీసీతారామచన్ద్ర దేవతా సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు- (అని అక్షితలు నీళ్ళు విడిచిపెట్టి-)

హరిః తత్సత్. సర్వం శ్రీ సీతారామచన్ద్రార్పణమస్తు

You can download Sri Rama Navami Pooja Vidhanam in Telugu pdf by clicking on the following download button.

Sri Rama Navami Pooja Vidhanam in Telugu pdf

Sri Rama Navami Pooja Vidhanam in Telugu PDF Download Link

REPORT THISIf the download link of Sri Rama Navami Pooja Vidhanam in Telugu PDF is not working or you feel any other problem with it, please Leave a Comment / Feedback. If Sri Rama Navami Pooja Vidhanam in Telugu is a copyright material Report This. We will not be providing its PDF or any source for downloading at any cost.

RELATED PDF FILES

Leave a Reply

Your email address will not be published.