Polala Amavasya Pooja Vidhanam Telugu PDF Summary
Dear users, today we are going to present you పొలాల అమావాస్య పూజా విధానం PDF / Polala Amavasya Pooja Vidhanam PDF in Telugu language to help you. This is a popular festival in South Indian states in which people observed fast for lord Ganesha. Polala Amavasya Vrat is performed on the day of Shravana Amavasya. People end this fast in the evening by eating some fruit. A huge number of people in South Indian states have observed this fast. Devotees can download the Polala Amavasya Pooja Vidhanam Telugu PDF by using the link below.
పోలేరమ్మ దేవి యొక్క పవిత్రమైన రోజున, మహిళలు ఈ దేవతను పూజిస్తారు మరియు వారి పిల్లల కోసం ఆమె దీవెనలు కోరుకుంటారు. వారు తమ పిల్లల శ్రేయస్సు కోసం వ్రతం ఆచరించడం ద్వారా ప్రార్థిస్తారు. పోలేరమ్మను పిల్లలు మరియు ఆరోగ్యానికి దేవతగా భావిస్తారు. ఆమె రక్షణను అందిస్తుంది మరియు వ్యాధి, అనారోగ్యం మరియు ఇతర దుష్ట శక్తుల నుండి పిల్లలను కాపాడుతుంది. ఈ పండుగను ప్రధానంగా వర్షాకాలంలో జరుపుకుంటారు.
పొలాల అమావాస్య పూజా విధానం PDF | Polala Amavasya Pooja Vidhanam PDF in Telugu
- పూజచేసే చోట శుభ్రంగా అలికి, వరిపిండితో ముగ్గువేసి, ఒక కందమొక్కను(కొందరు 2 కందమొక్కలను తల్లి పిల్లలుగా పూజిస్తారు) వుంచి, దానికి పసుపుకొమ్ము కట్టిన నాలుగుతోరాలను( ఆనవాయితీ ప్రకారం కొంతమందికి 4 తోరాలు వుండవు 2 తోరాలే ఉంటాయి.) అక్కడ వుంచి, ముందుగా వినాయకుడికి పూజను చేయాలి. గమనిక: కందమొక్క దొరకని పక్షంలో కందపిలక పెట్టి పూజ చేసుకొనవచ్చును.
- తర్వాత మంగళగౌరీదేవిని కానీ, సంతానలక్ష్మిని కానీ ఆ కందమొక్కలోకి ఆవాహనచేసి షోడశోపచార పూజను చేయవలెను.
- తొమ్మిది పూర్ణం బూర్లు మరియు తొమ్మిది గారెలు, తొమ్మిది రకముల కూరగాయలతో చేసిన ముక్కల పులుసు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి.
- తదుపరి కధను చదువుకొని కధా అక్షతలను శిరస్సున ధరించాలి.
- అనంతరం బాగా మంచి సంతానవతి అయిన పెద్ద ముత్తయిదువును పూజించి నైవేద్యం పెట్టని తొమ్మిది పూర్ణంబూర్లు, ఒక తోరాన్ని, ఆమెకు వాయనంగా సమర్పించాలి.
- తాంబూలం లో కొత్తచీర, రవికల గుడ్డ పెట్టి ఆమెకు సమర్పించి దీవెనలు అందుకోవాలి.
- ఆ తర్వాత కందమొక్కకు ఒక తోరాన్ని కట్టి, మరొకటి తను మెడలో కట్టుకుని, మిగిలిన తోరాన్ని తన ఆఖరు సంతానం మొలలో కట్టాలి(సంతానం ఇంకా లేనివారు అక్కడ ఉన్న పిల్ల కందమొక్కకు సమర్పించవచ్చును).
Polala Amavasya Pooja Vidhanam Telugu PDF
- ఆడపిల్లకావాలనుకునేవాళ్ళు( ఉన్నవాళ్ళు) గారెలు సమర్పించాలి.
- మగపిల్లవాడు కావాలనుకునేవాళ్ళు బూరెలు (ఉన్నవాళ్ళు ) అమ్మవారికి సమర్పించాలి.
- పూర్ణంబూరె పూర్ణగర్భానికి చిహ్నం. అందులోని పూర్ణం, గర్భస్థ శిశువుకు చిహ్నం. స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది కనుక పూర్ణబూరెలు వాయనంగా ఇవ్వాలనే నియమాన్ని విధించారు.
- గోదావరి జిల్లాలో కొందరు పనసఆకులతో బుట్టలు కుట్టి, ఇడ్లీపిండి అందులో నింపి ఆవిరి మీద ఉడికించి అమ్మవారికి నైవేద్యం పెడతారు. వీటినే పొట్టిక్కబుట్టలు అని అంటారు.
Here you can download the పొలాల అమావాస్య పూజా విధానం PDF / Polala Amavasya Pooja Vidhanam PDF in Telugu by click on the link below.