గోదా కళ్యాణం | Goda Kalyanam Telugu - Description
ప్రియమైన మిత్రులారా, ఈరోజు మేము మీ అందరి కోసం గోదా కళ్యాణం PDF / Goda Kalyanam Telugu PDF ని అప్‌లోడ్ చేయబోతున్నాము. మీకు తెలిసినట్లుగా మనం సాధారణంగా సీతా రామ కల్యాణం మరియు శ్రీనివాస కళ్యాణం వంటి అనేక రకాల కళ్యాణోత్సవాలను జరుపుకుంటాము. కానీ సనాతన హిందూ ధర్మంలో గోదా రంగనాథుని వివాహానికి ఇతర వివాహాలతో పోలిస్తే ఒక ప్రత్యేకత ఉంది.
గోదా కళ్యాణం చేయడం ద్వారా ప్రజలు గోదాదేవి మహిమను పొందుతారు. శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే గొప్ప భక్తుడు ఉండేవాడు. శ్రీకృష్ణుడు మర్రి ఆకు (వటపత్రశాయి)పై తేలుతూ ప్రపంచాన్ని రక్షించాడని నమ్ముతారు. అందువల్ల ఆలయంలో ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడు. విష్ణుచిత్తుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును దర్శించి ఆశీర్వదించాడని ఒక కథ ప్రచారంలో ఉంది.
అందువలన అతను విష్ణు భక్తులలో ఒకరిగా ఎంపిక చేయబడ్డాడు మరియు పెరియాళ్వార్ గౌరవాన్ని ఇచ్చాడు. ఒకరోజు పెరియాళ్వారు తులసి మొక్కల కోసం తవ్వుతుండగా ఒక చిన్న అమ్మాయిని చూశాడు. దేవుడిచ్చిన బహుమతిగా ఆమెను పెంచాడు. ఆమెకు ‘కోడై’ (పువ్వు) అనే పేరు పెట్టాడు… ఆ పేరు క్రమంగా గోదాగా మారింది.
గోదా కళ్యాణం PDF | Goda Kalyanam Telugu PDF
మిగిలిన దేవతా కళ్యాణోత్సవాలతో పోలిస్తే గోదా రంగనాథుల యొక్క గోదా కళ్యాణం ప్రత్యేకతకు రెండు కారణాలు ఉన్నాయి. గోదాదేవి అద్భుతమైన వ్రతాన్ని ఆచరించి, ఆ ఆచరించిన దాన్ని మన దాకా ఆచరించేట్టుగా చేసింది అందుకే “పాడియరుళవల్ల పల్-వళై యాయ్” అని అంటుంటాం కదా.
తాను ఆచరించిన దాన్ని ఎంతో కాలం దాక ఆచరించగలిగేట్టుగా ప్రబంధాన్ని అందించింది. అది గోదా దేవి గొప్పతనం. ఇది వరకు ఇలాంటి వ్రతాన్ని గోపికలు చేసారు కానీ వారు తరువాతి వారికి ఏమి అందించలేదు శ్రీకృష్ణుని అనుభవాన్ని పొంది ఊరుకున్నారు తప్ప.
సీతమ్మ రామచంద్రుణ్ణి వివాహమాడి ఊరుకుంది, పద్మావతి అమ్మవారు శ్రీనివాసున్ని వివాహమాడి ఊరుకుంది, కానీ గోదాదేవి ఒక్కో పాటలో మనం ఏం తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి, ఎలా ఆచరించాలో చెప్పింది. సీతమ్మ కానీ పద్మావతి అమ్మవారు కానీ భగవంతుణ్ణి తనవంటి కదిలే రూపంలోనే వివాహ మాడారు వారి అవతారాల్లో. కానీ గోదా దేవి మనవకన్యగా ఉంటూ విగ్రహ స్వరూపుడైన రంగనాథున్ని వివాహమాడింది(గోదా కళ్యాణం).
తన ఆచరణతో విగ్రహ స్వరూపుడైన భగవంతుణ్ణి కదిలేట్టు చేసుకుంది. ఇదే అమ్మవారి యొక్క గొప్పతనం. మన ఎదురుగుండా కనిపించే విగ్రహాన్ని, అది దైవమని విశ్వసించి, మనం చెప్పినట్లుగా మనం పిలిచినట్లుగా అది కదలగలుగుతుంది, పలకగలుగుతుంది అనే విశ్వాసాన్ని ఆండాళ్ తల్లి నిరూపించి చూపించింది.
“ఉలగనిల్ తోత్రమాయ్ నిండ్ర శుడరే తుయిలెరాయ్“, అంది అమ్మ అంటే లోకంలో కంటికి కనిపించేట్టుగా విగ్రహరూపంలొ ఉండే భగవంతుడా! ఆ విగ్రహ రూపంలో నీ ప్రభావము అనుపమానము, అసమానము అని విశ్వసిస్తున్నాను అని చెప్పి భగవంతుణ్ణి కదిలేట్టు చేసింది.
మూడు పనులు చేసి విగ్రహరూపంలొ ఉండే భగవంతుణ్ణి కదిలేట్టు చేసింది. అవి కృష్ణమ్ ఉద్భోధ్య, కృష్ణమ్ అధ్యాపయంతి మరియూ “కృష్ణమ్ బలాత్కృత్య భూంక్తే“. ఆయన ఏమి ఉలకకుండా పడుకుంటే మేల్కొల్పింది. చిన్న పిల్లవాడికి బెత్తం చూపి పాఠం చెప్పినట్లుగా, మనల్ని బాగుచేయడానికి, మనం తెలుసుకోవలసిన విషయాలని మనకి ఆయన ఎట్లా తెలిసేట్టు చేయాలో ఆయనకి పాఠాలు నేర్పింది.
అంతే కాదు స్వామి విగ్రహరూపంలో ఉన్నా ఆయన్ని నిర్బందించి, బంధించి, ఆయన్ని పొందింది. అందుకే ఎక్కడో శ్రీవిల్లిపుత్తూరులో ఆంఢాళ్ ఉంటే, శ్రీరంగంలో ఉన్న స్వామి స్పందించి అర్చకులని, రాజుని అమ్మని తీసుకురమ్మని ప్రేరేపించి రప్పించుకున్నాడు.
విగ్రహంలో ఉన్న స్వామితో వివాహమని తెలియగానే జనాలు తండోపతండాలుగా తరలి వచ్చి ఆశ్చర్యపోయినందుకే ఆ వీదికి చిత్ర వీది అనే పేరు ఏర్పడిపోయింది. తరువాత వీది ఉత్తరవీది, అక్కడ ఉన్న స్వామి అమ్మని వివాగమాడి గోదాదేవిని తనలో చేర్చుకున్నాడు.
మానవకన్యగా ఉన్న ఆండాళ్ తల్లిని ఉత్సవ మూర్తిగా మలచి తానూ ఉత్సవ మూర్తిగా కలిసి ఉన్నాడు శ్రీవిల్లిపుత్తూరులో, అమ్మ ఆదేశాన్ని బట్టి.
అమ్మ రామచంద్రుని ఇలవేల్పు అయిన శ్రీరంగనాథున్ని వివాహమాడటంతో సీతారాములకే ఇలవేల్పు అయ్యింది. సీతారాములకి తరువాతి కాలంలో అవతరించినా వారికి ఇలవేల్పు అవడం అమ్మ గొప్పతనం.
Sri Goda Kalyanam Story in Telugu PDF – గోదాదేవి అసలు కథ
- తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే భక్తుడు ఉండేవాడు. ఈ విల్లిపుత్తూరులోనే శ్రీకృష్ణుడు, మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్నికృష్ణుడే.
- విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలలని అర్పిస్తూ ఉండేవాడు. విష్ణుచిత్తుడి అసలు పేరు భట్టనాథుడు. నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది. ఆయనను విష్ణుభక్తులైన ఆళ్వారులలో ఒకరిగా ఎంచి, ఆయనకు పెరియాళ్వారు అంటే – పెద్ద ఆళ్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు.
- అలాంటి పెరియాళ్వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది. ఆమెను సాక్షాత్తూ భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు. ఆమెకు ‘కోదై’ అంటే – పూలమాల అన్నపేరుతో గారాబంగా పెంచసాగాడు విష్ణుచిత్తుడు. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది.
- గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూపాడుతూ పెరిగిందే. యుక్తవయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్తా ప్రేమగా మారిపోయింది. కళ్లుమూసినా, తెరిచినా ఆ నల్లనివాడే కనిపించసాగాడు. తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్లంతా ఒకప్పటి గోపికలనీ, తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది.
- అంతేకాదు! తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తనే ధరించి, తనలో ఆ కృష్ణుని చూసుకుని మురిసిపోయేది. ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంట పడనే పడింది.
- తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్లూ ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు. కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి, గోదాదేవి సాక్షాత్తూ భూదేవి అవతారమేననీ, ఆమె వేసుకున్న మాలలను ధరించిడం వల్ల తనకు అపచారం కాదు కదా, ఆనందం కలుగుతుందనీ తెలియచేశాడు.
- ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణప్రేమని మరింతగా పెంచాయి. తనకు పెళ్లంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. ఈ వ్రతం చేయాలంటే ఆహారానికీ, అలంకారానికీ సంబంధించిన చాలా కఠినమైన నియమాలని పాటించాల్సి ఉంటుంది.
- అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తెలని కూడా ప్రోత్సహించింది. తన స్నేహితురాళ్లను మేలుకొలిపేందుకు, వారికి వ్రత విధానాలను తెలియచేసేందుకు, తనలో కృష్ణభక్తిని వెల్లడించేందుకు 30 పాశురాలను పాడింది గోదా. అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవభక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై!
- ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు, ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. దాంతో ఆయన విష్ణుచిత్తునికి కనిపించి, గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మనీ… అక్కడ రంగనాథునిగా వెలసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటాననీ చెప్పాడు.
- శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియచేశాడు. కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవినీ, విల్లిపుత్తూరులోని ప్రజలనూ తీసుకుని శ్రీరంగానికి బయల్దేరాడు. అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు.
- పెళ్లికూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి, అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగిరోజు జరిగింది. అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగినాడు గోదాదేవికి, విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు.
You can download Goda Kalyanam Telugu PDF by clicking on the following download button.