బ్రహ్మంగారి కాలజ్ఞానం | Brahmam Gari Kalagnanam Telugu PDF Summary
Dear readers, here we are offering బ్రహ్మంగారి కాలజ్ఞానం PDF / Brahmam Gari Kalagnanam PDF in Telugu to all of you. Kalagnanam is one of the most important books in Telugu. Brahmam Gari Kalagnanam is a book that consists of all the vital predictions related to the present, past, and future.
Kalagnanam is written by various important people in history that have some specific knowledge and wisdom bout the predictions. They have written these predictions for the welfare of mankind so that they can be aware of what is about to happen in the very near future.
బ్రహ్మంగారి కాలజ్ఞానం PDF / Brahmam Gari Kalagnanam in Telugu PDF
కాలజ్ఞాన తత్వాలు
వ్యావహారిక భాషంలో మౌఖికంగా కొనసాగిన తత్వాలను తొలిగా పరిమి వీరాచార్యులు 19 వశతాబ్ది చరమభాగంలో సేకరించి లిఖితబద్ధంచేశాడు. ఇవి “పోతులూరివీరబ్రహ్మంగారి కాలజ్ఞానతత్వములు” అనే పేరుతో ముద్రించబడ్డాయి.[9]దీనిలో బ్రహ్మంగారు, సిద్ధయ్య, ఆగంటి లక్ష్మప్ప, నాసరయ్య, చలమయ్య, నరసింహదాసు తత్వాలుకూడి వున్నాయి. పరమాత్మ బోధను ప్రధానంగా ఇవి వివరిస్తాయి. ప్రసిద్ధి చెందిన ఒకతత్వం తొలి భాగం క్రిందనీయబడింది.
చేరి మొక్కితె బ్రతుక నేర్చేరు
చెప్ప లేదంటనగ బోయెరు
తప్పదిదిగో గురుని వాక్యము
తప్పుదోవన బోవువారల
చప్పరించి మ్రింగు శక్తులు ॥చెప్ప॥
మొప్పెతనమున మోసపోయేరు అదిగాక కొందరు
గొప్పతనమున గోసుమీరేరు
ఇప్పుడప్పుడనగ రాదు
ఎప్పుడో ఏవేళనో మరి
గుప్పుగుప్పున దాటిపోయెడు
గుర్రపడుగులు ఏరుపడును ॥చెప్ప॥
తమ తప్పులు తలచకున్నారు తార్కాణమైతే
ఎక్కువతో తెలియనేర్తురు
జోక తోడుత తల్లి పిల్లలు
జోడు బాసి అడవులందు
కాయశోకము జేసి ప్రజలు
కాయ కసరుల నమలి చత్తురు ॥చెప్ప॥
కేక వేసియు ప్రాణమిడిచేరు రాకాసి మూకలు
కాక బుట్టి కలువరించేరు.
ఆకాశము ఎర్రనౌను
అరుమతము లొక్కటౌను
లోకమందు జనులు అందరు
నీరు నిప్పున మునిగిపోదురు ॥చెప్ప॥
ఇప్పటి వరకు జరిగినవిగా భావిస్తున్నవి
- నీళ్ళతో దీపాలు వెలిగిస్తారు (విద్యుత్ శక్తి) (నీటీతొ జనరేటరు)
- ఎద్దులు లేకుండానే బళ్ళు నడుస్తాయి. (యంత్ర వాహనాలు)
- కాశీ పట్నం 40 రోజుల పాటు పాడుబడుతుంది.
- ఒక అంబ (వితంతువు) 16 సంవత్సరాలు రాజ్యమేలుతుంది. (ఇందిరా గాంథి)
- తెరమీది బొమ్మలు గద్దెలెక్కుతారు. రంగులు చూసి ప్రజలు మోసపోతారు. (ఎన్.టి.ఆర్, జయలలిత, తదితరులు. చలన చిత్రాలు)
- రాచరికాలు, రాజుల పాలనా నశిస్తాయి. (ప్రజా ప్రభుత్వాలు)
- ఆకాశాన పక్షివాహనాలు కూలి అనేకమంది మరణిస్తారు. (విమాన ప్రమాదాలు)
- జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది.
- బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి.
- హైదరాబాదులో తురకలు హిందువులు ఒకరిని ఒకరు నరుక్కుని చనిపోతారు. (మత కలహాలు)
- దేవస్థానాలు పాపాత్ముల వలన నాశనమౌతాయి. దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి. (దొంగతనం)
- చిత్రవిచిత్రమైన యంత్రాలు వస్తాయి. కానీ చావుపుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు. సృష్టిని మార్చటానికి అనేక ప్రయత్నాలు చేస్తారు.
- రావణ కాష్టాన కల్లోలములు రేగి దేశాన్ని అల్లకల్లోల పరుస్తాయి. (శ్రీలంకలోని తీవ్రవాద పరిణామాలు)
- గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు. (లాల్ బహుద్దూర్ శాస్త్రి)
- కపట యోగులు విపరీతంగా పెరిగి పోతారు. వీరివలన ప్రజలంతా మోసపోతారు.
- అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయి
- నది గండకి ఒడ్డున రాళ్ళు నృత్యం చేస్తాయి (నేపాల్ భూకంపము)
-
కాలజ్ఞాన అంశాలు
- వేశ్యల వలన ప్రజలు భయంకర రోగాలకు గురి ఔతారు. మనుషులు వావి వరసలు లేకుండా ప్రవర్తిస్తారు వారికి డబ్బే ప్రధానం ఔతుంది.
- రాజులు తమ ధర్మాన్ని మరచి విందులూ వినోదాలలో మునిగి ధర్మ భ్రష్టులౌతారు.
- శాంతమూర్తులకు కూడా కోపం విపరీతంగా వస్తుంది. వివిధ వర్ణాల వారు తమ ధర్మం వదిలి ఇతర ధర్మాలను ఆచరించి నాశనం ఔతారు.
- పంటలు సరిగా పండక, పాడి పశువులు సరిగా పాలివ్వక భయంకరమైన కరువు సంప్రాప్తిస్తుంది.
- బ్రాహ్మణులు తమ ధర్మాలను వదిలి ఇతర కర్మలను ఆచరించటం వలన దేశం కల్లోలితమౌతుంది.
- చోళమండలం నష్టాలపాలౌతుంది.
- వావి వరసలు గౌరవ మర్యాదలు క్షీణించి తండ్రి కొడుకును కొడుకు తండ్రిని దూషిస్తారు.
- ప్రజలు కొరువులను నోట పెట్టుకుని తిరుగుతారు. కొండలు మండుతాయి.
- జనుల కడుపులో మంటలు పుడతాయి. నోటిలో బొబ్బలు లేస్తాయి. నెత్తురు కక్కుతూ, రోగాల పాలై జనులు మరణిస్తారు. జంతువులూ అలాగే చస్తాయి.
- దుర్మార్గులు రాజులౌతారు. మంచి ప్రవర్తన కలవారు భయంకర కష్టాలపాలై హీనంగా మరణిస్తారు.
- మతకలహాలు పెరిగి ఒకరిని ఒకరు చంపుకుంటారు.
- అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయి.
- నీళ్ళతో దీపాలను వెలిగిస్తారు.
- ఇతర దేశస్తులు భారతదేశాన్ని పాలిస్తారు.
- మాచర్లలో రాజులంతా ఒక స్త్రీ వలన కలహించుకుని మరణిస్తారు.
- పట్టపగలే చుక్కలు కనిపించి కొంతమంది ప్రజల మరణానికి హేతువౌతాయి.
- ఒకరి భార్యను ఒకరు వశపరచుకుంటారు. స్త్రీ పురుషులిర్వురూ కామపీడితులౌతారు.
- వేంకటేశ్వర క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి. మహమ్మదీయులు దేవాలయాన్ని దోచుకుంటారు.
- ఐదువేల ఏళ్ళ తరువాత కాశీలో గంగ కనిపింకుండా మాయమై పోతుంది.
- చెన్నకేశవ స్వామి మహిమలు నాశనమౌతాయి.
- కృష్ణానది మధ్య బంగారు తేరు పుడుతుంది. అది చూసినవారికి కండ్లు పోతాయి.
- ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య క్షీణిస్తుంది.
- ఐదువేల ఏళ్ళ తరువాత నేను వీరభోగ వసంతరాయలుగా అవతరించి ధ్ర్మాత్ములను కాపాడి పాపాత్ములను శిక్షిస్తాను. నా భక్తులు తిరిగి నన్ను చేరుకుంటారు.
- వెంకటేశ్వరునికి మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు.
- కృష్ణా గోదావరి మధ్య పశువులు కూడి మరణిస్తాయి.
- తూర్పు నుండి పడమరకు ఒక యోజనము ప్రమాణం వెడల్పుగా ఆకాశంలో చెంగావి చీర కట్టినట్లు కనపడుతుంది.
అన్నాజయ్యకు జ్ఞానబోధ
- ఎంతో మందిమార్బలం ఉన్నా రాజులు సర్వనాశనమైపోతారు. గ్రామాలలో చోరులు పెరిగిపోతారు.
- పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి.
- విచిత్ర వ్యాధులు పుట్టి ప్రజలు కూర్చున్నవారు కూర్చున్నట్లు నిలబడిన వారు నిలబడినట్లు మరణిస్తారు.
- రాత్రింబవళ్ళు గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయి. నీటిలోని చేపలు తామ చస్తామని పలుకుతూ వెలుపలికి వస్తాయి.
- శ్రీశైల పర్వతానికి ఒక ముసలి వస్తుంది. అది భ్రమరాంబ గుడిలో దూరి ఎనిమిది రోజులుండి మేకలా కూసి మాయమౌతుంది.
- శ్రీశైలంలో అగ్ని వర్షం పుడుతుంది. గుగ్గిళ్ళ బసవన్న (నందీశ్వరుడు) రంకెలు వేస్తాడు ఖణ ఖణమని కాలు దువ్వుతాడు.
- సూర్యమండలం నుండి మాటల రూపంలో శబ్దం వినపడుతుంది.
- విషవాయువు కొట్టినప్పుడు శివునికంట నీరు కారుతుంది.
- గ్రామాలలో పట్టణాలలో నెత్తుటి వానకురుస్తుంది.
- సూర్యుడు, చంద్రుడు ఉన్నంతకాలం నా మఠానికి పూజలు జరుగుతాయి. నా మఠానికి ఈశాన్యంలో ఒక చిన్నదానికి ఒక చిన్నవాడు పుడతాడు. అతడు నేనే దేవుడినని నన్ను పూజించండి అని పలుకుతాడు.
- నెల్లూరు సీమ మొత్తం నీట మునుగుతుంది.
You can download Brahmam Gari Kalagnanam PDF in Telugu by clicking on the following download button.