భగవద్గీత | Bhagavad Gita PDF in Telugu

భగవద్గీత | Bhagavad Gita Telugu PDF Download

భగవద్గీత | Bhagavad Gita in Telugu PDF download link is given at the bottom of this article. You can direct download PDF of భగవద్గీత | Bhagavad Gita in Telugu for free using the download button.

భగవద్గీత | Bhagavad Gita Telugu PDF Summary

హలో అబ్బాయిలు, ఇక్కడ మేము మీ అందరికీ భగవద్గీత / Bhagavad Gita PDF in Telugu ని తెలుగులో. భగవద్గీత చాలా ప్రాచీనమైన మరియు ప్రసిద్ధ గ్రంథం. సనాతన హిందూ మతంలో భగవద్గీత చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.
భగవద్గీతలో, 18 అధ్యాయాలు మరియు 700 శ్లోకాలు గీతలో వివరంగా వివరించబడ్డాయి. ఈ శ్లోకాలలో శ్రీ కృష్ణుడు మరియు అర్జునుడు మధ్య సంభాషణ చెప్పబడింది. మహాభారత యుద్ధ సమయంలో వీరిద్దరి మధ్య ఈ సంభాషణ జరిగింది.
మహాభారత యుద్ధంలో, అర్జునుడు యుద్ధం చేయడానికి నిరాకరించినప్పుడు, శ్రీ కృష్ణుడు ఈ శ్లోకాల ద్వారా అతనికి బోధించాడు మరియు ధర్మం మరియు కర్మల గురించి అర్జునుడికి నిజమైన జ్ఞానం కలిగించాడు. శ్రీ కృష్ణుని ఈ బోధనలు “భగవద్గీత” అనే పుస్తకంలో సంకలనం చేయబడ్డాయి. ఈ శ్లోకాలను చదవడం మరియు అర్థం చేసుకోవడం ద్వారా, ఒక వ్యక్తి తన జీవితాన్ని చాలా అందంగా మార్చుకోవచ్చు.

భగవద్గీత / Bhagavad Gita Telugu PDF

  • శ్రీ కృష్ణుడు అర్జునునికే గీతాబోధ చేసెను. భీష్మునికి చేయక పోవటానికి కారణం ఏమిటంటే న్యాయం, ధర్మం, పాండవుల పక్షాన ఉందని చెప్తూ అధర్మపరులైన కౌరవుల పక్షాన యుద్దం చేసారు.
  • అలోచనకు, చెప్పేమాటకి, చేసే క్రియకి భేదం ఉన్నది. అనగా త్రికరణశుద్ది లేదు. అట్టివారు జ్ఞానబోధకు అర్హులు కారు.
  • ధర్మరాజు ధర్మవర్తనుడే కాని అతని పశ్చాత్తాపమేకాని పూర్వతాపం లేదు. ఒక పనిచేసే ముందుగానే దాని మంచి చెడ్డలు విచారించేవాడు పూర్వతాపం కలవాడు.
  • జూదం ఆడి ఓడిపోయి అడవులు పాలయ్యాక జరిగిన దానికి పశ్చాత్తాపపడి ప్రాయశ్చిత్తం చేసుకోవడం ప్రారంభించాడు.
  • ముందుగా దాని పర్యావసానం ఏమిటో ఆలోచించలేదు. పూర్వతాపం లేనివారు గీతాబోధకు అర్హులు కారు.
  • అర్జునుడు యుద్దభూమిలోకి ప్రవేశించి, తనవారినందరిని చూచి యింతమందిని చంపి ఈ రాజ్యాన్ని అనుభవించే కంటే భిక్షాటన మేలు.
  • అందరూ చనిపోయాక ఈ రాజ్యాన్ని పాలించి ఏమి ఆనందం అనుభవించగలము? త్రిలోకాధిపత్యం యిచ్చినా నేను యుద్ధం చెయ్యలేను అని ముందుగానే విచారించాడు.
  • తనను శిష్యునిగా చేసుకుని కర్తవ్యం బోధించమని శ్రీ కృష్ణ భగవానుని ప్రార్థించాడు. అందువలన అర్జునునికే గీతా బోధ చేయబడింది. పూర్వతాపం పరిశుద్ద హృదయమున్న వారికే కలుగును.
  • పరిశుద్ద హృదయుడే జ్ఞానబోధకు అర్హుడు.

Bhagavad Gita Questions and Answers in Telugu

1. భగవద్గీత ఏ పవిత్ర గ్రంధంలోనిది ?

జ. మహా భారతమునందలి భీష్మ పర్వంలో గీత వివరింప బడినది.

2. గీతలో ఎన్ని శ్లోకములు గలవు? జ.

గీతలో 700 శ్లోకములు కలవు.

3. గీతలో ఎన్ని అధ్యాయములు కలవు ?

జ. గీతలో 18 అధ్యాయములు కలవు.

4. ప్రతి అధ్యాయమునకు యివ్వబడిన ప్రత్యేక నామము ఏది?

జ. ప్రతి అధ్యాయమును యోగము అందురు.

5. గీత ఎక్కడ, ఎప్పుడు , ఎవరికి చెప్పబడినది?

జ. గీత కురుక్షేత్రంలో కౌరవ, పాండవుల యుద్దారంభంలో అర్జునునికి శ్రీ కృష్ణపరమాత్మచే చెప్పబడినది.

6. గీత ఎందుకు చెప్పబడినది?

జ. నావారు అనే మమకారం, నాచే చంపబడుతున్నారనే మోహం అర్జునుని ఆవరించి విషాదాన్ని కలుగచేయగా విషాదయోగాన్ని పోగొట్టి జ్ఞానాన్ని కలుగచేయడానికి శ్రీ కృష్ణునిచే గీతాబోధ చేయబడినది.

7. గీత దీనుడైన అర్జునుని ఏవిధంగా మార్చినది?

జ. గీత దీనుడైన అర్జునుని ధీరునిగా మార్చింది.

8. అర్జునుని శ్రీ కృష్ణుడు అనేక నామాలతో గీతలో సంబోదించాడు. అవి ఏవి? వాని భావమేమి? జ.

1) అర్జున: – పవిత్రమైన, నిర్మలమైన మనసు గలవాడు.
2) పార్థ: – పృధివి (భూమి యొక్క) పుత్రుడు. పృధి అను పేరు కుంతీదేవికి కలదు. అంతే కాక భూమి యొక్క పుత్రుడు అంటే ప్రపంచ మానవులందరికీ ప్రతినిధి పార్ధుడు.
3) కౌంతేయ – సావధానంగా దైవబోధను వినగలిగేవాడు.
4) అనసూయ – అసూయ లేనివాడు.
5) కురునందన – కార్యమును చేయుటలో ఆనందమును అనుభవించువాడు.
6) పరంతప – యుద్దములో శత్రువులను తపింప చేయువాడు.
7) విజయ – ఎల్లప్పుడూ జయమునే పొందువాడు.
8) గుడాకేశ – యింద్రియ నిగ్రహం గలవాడు.
9) ధనంజయ – జ్ఞాన ధనమును పొందినవాడు.
10) పాండవ – పాండవరాజు కుమారుడు (తెల్లదనము) సాత్వికగుణము , నిర్మలతత్వం గలిగి పరిశుద్దమైనవాడు .

9. భోజనానికి ముందుగా రెండు శ్లోకాలు పఠించి భుజించాలని స్వామి చెప్పారు. ఆ శ్లోకాలేవి? ఎందుకు అవి పఠించాలి?

బ్రహ్మార్పణం బ్రహ్మహవి: బ్రహ్మగ్నౌ బ్రహ్మణాహుతమ్ బ్రహ్మైవ తేన గన్తవ్యం బ్రహ్మకర్మ సమాధిన అహం వైశ్వానరో భూత్వా ప్రాణినామ్ దేహమాశ్రిత: ప్రాణాపాన సమాయుక్త: పచామ్యన్నం చతుర్విదమ్ ఈ శ్లోకాలు రెండు చదివి భోజనం చేస్తే అది ప్రసాదంగా మారిపోతుంది.
ఆహారానికి పాత్రశుద్ది, పాకశుద్ది, పదార్థశుద్ది ఉండాలని స్వామి చెప్పారు. పాత్రశుద్ది మనంచేయగలం. పాకశుద్ది అంటే ఎలాంటి తలపులతో వంట చేస్తున్నారో, పదార్థశుద్ది అనగా మనం తెచ్చుకున్న పదార్ధములు మోసము చేసి తెచ్చినవో, దొంగిలించినవో మనకు తెలియదు.
అన్యాయార్జన పదార్ధము అనారోగ్యాన్ని, దుర్భుద్దులను పెంచుతాయి. అందువలన ఆహారం భుజించేముందు ఆహారాన్ని దైవానికి సమర్పించి భుజిస్తే అది ప్రసాదంగా మారి దోషరహితం అయిపోతుంది. ఎట్టి తిండియో అట్టి త్రేపు. ఆహారాన్ని బట్టి ఆలోచనలు వుంటాయి.
అందువలన రజో, తమో గుణ సంబంధమైన ఆహారాన్ని త్యజించి సాత్వికాహారము దైవానికి అర్పించి భుజిస్తే సత్ప్రవర్తన, సద్బుద్ది, సదాలోచనలు కలుగుతాయి. అన్ని యింద్రియాలకు సాత్వికాహారం యివ్వాలని స్వామి చెప్పారు.

10. గీత నిత్య జీవితంలో ఏవిధంగా మనకు ఉపకరిస్తుంది?

జ. స్వామి ముఖ్యంగా ‘శ్రద్దావాన్ లభతే జ్ఞానం’ – ‘సంశయాత్మ వినశ్యతి ‘ అని గీతలోని రెండు శ్లోకాల గురించి చెప్ప్తూ ఉంటారు. శ్రద్దగలవాడు తప్పక జ్ఞానాన్ని పొందుతాడు. అధ్యాత్మిక జ్ఞానానికైనా , లౌకిక జ్ఞానానికైనా శ్రద్ద చాలా అవసరం. అందువలన శ్రద్దతో ఏదైనా సాధించవచ్చని గీత బోధిస్తుంది.
శ్రద్దతో నచికేతుడు ఆత్మ జ్ఞానాన్ని , ఏకలవ్యుడు ధనుర్విద్యను సాధించగలిగారు. ‘సంశయాత్మా వినశ్యతి ‘ సందేహాలు కలవారు ఎప్పటికీ అభివృద్ది సాధించలేడు. గురువాక్యంపైన, దైవం పైన నమ్మకం, శ్రద్ద గలవాడే ఏదైనా సాధించగలడు. అందువలన సంశయాలు, సందేహాలు వదిలిపెట్టాలి. యింతేకాక ‘అద్వైష్టా సర్వభూతానాం’ ఏ ప్రాణినీ ద్వేషించవద్దు.
‘అనుద్వేగకరం వాక్యం’ ఎవరినీ మాటలతో హింసించవద్దు. సంతుష్టస్పతతం’ ఎల్లప్పుడు సంతృప్తిగా ఉండాలి. సమశ్చత్రౌ చ మిత్రేచ, శత్రువులను, మిత్రులను ఒకేవిధంగా చూడాలి. గౌరవా గౌరవాలకు, సుఖదు:ఖాలకు పొంగిపోక, కుంగిపోక ఉండాలి. యిలాంటి లక్షణాలు కలవాడు నాకు ప్రియమైన భక్తుడు అని శ్రీ కృష్ణ భగవానుడు బోధించాడు. అంటే మానవులంతా తమ నిత్య జీవితంలో ఈ లక్షణాలు అలవర్చుకుంటే భగవంతుని అనుగ్రహానికి పాత్రులవుతారు.
వంట చెయ్యటానికి ఒక్క అగ్గిపుల్ల చాలు. అలాగే ఒక్క గీతా శ్లోకాన్ని మనం ఆచరించడానికి ప్రారంభించినా క్రమేపి అన్ని సద్గుణాలు మనలో ప్రవేశించి భగవంతునికి ప్రియమైన భక్తులం కాగలము.
You can download the భగవద్గీత / Bhagavad Gita Telugu PDF by going through the following download button.

భగవద్గీత | Bhagavad Gita PDF Download Link

REPORT THISIf the download link of భగవద్గీత | Bhagavad Gita PDF is not working or you feel any other problem with it, please Leave a Comment / Feedback. If భగవద్గీత | Bhagavad Gita is a copyright material Report This. We will not be providing its PDF or any source for downloading at any cost.

Leave a Reply

Your email address will not be published.